తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం గురువారం లండన్‌లో ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ ‘బ్రో’ చిత్రంలో సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా నటించిన శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏ స్టార్ ప్రొడక్షన్స్, ఏబి ఇంటర్‌నేషనల్ ఫిలింస్, అనిక ప్రొడక్షన్‌లు సంయుక్తంగా ఈ ‘దీన్ తననా’ చిత్రాన్ని హుస్సేన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాయి. తొలి షాట్‌ను నటుడు అలీ, శ్రీనివాస్‌లపై చిత్రీకరించారు. పదిరోజుల పాటు లండన్‌లోనే తొలి షెడ్యూల్ నిర్వహిస్తారు.