– పెరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఈ దఫా ఎన్నికల్లో వృద్దులు,వికలాంగులకు హోమ్ పోలింగ్ విధానంలో ఓటు వినియోగం కల్పించడంతో గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గణనీయంగా పెరిగాయి. ఈ ఎన్నికల్లో ఉపాద్యాయులు 564,వృద్దులు,వికలాంగులు 167,సర్వీస్ ఓటర్లు 15 మంది మొత్తం 746 మంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ విధానం వినియోగించుకున్నారు. 2009 లో 248,2014 లో 478,2018 లో 364,2023 లో 746 మంది పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సంవత్సరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
2009 248
2014 478
2018 364
2023 746
హోమ్ పోలింగ్ పై విస్తృత ప్రచారం కల్పిస్తే వృద్దులు, వికలాంగుల ఓట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.