ఆరోగ్యంపై టీ, కాఫీల ప్రభావం

Effect of tea and coffee on healthప్రస్తుత రోజుల్లో టీ, కాఫీలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ఉద్యోగులు, స్పోర్ట్స్‌ పర్సన్స్‌, టీచర్స్‌, ఫీల్డ్‌వర్కర్స్‌… ఒక్కరేమిటి? ఎవరైనా సరే అవసరానికి మించి ఎక్కువగా టీ, కాఫీలు ఆహారంలోకి చేర్చినట్లయితే ఆరోగ్యసమస్యలు వస్తాయి.
– టీ, కాఫీలు రిఫ్రెష్‌మెంట్‌ కోసం మొదలయి ఇప్పుడు అలవాటుగా మారిపోయింది.
– కానీ వీటి వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అంతకన్నా అనారోగ్య కారణాలు వున్నాయి.
– రోజుకు రెండు కప్పుల టీ లేదా కాఫీ తీసుకోవచ్చు.
– పరగడుపున టీ, కాఫీలు తాగడం వల్ల గ్యాస్టిక్‌ సంబంధ సమస్యలు వస్తాయి. దానికి బదులు నానబెట్టిన ఖర్జూర నీళ్లు, లేదా గోరువెచ్చని నీరు తీసుకోవడం మంచిది. ఇంకా మెంతిపొడి నీరు, సోంపు నీరు, ధనియాలనీరు, జీలకర్ర + అల్లం నీరు జీర్ణసమస్యలు ఉన్నవారు తీసుకోవాలి.
– నీరసం ఉన్నవారు అంజీరా నీళ్లు, ఖర్జూర నీళ్లు, నిమ్మరసం + తేనె, కిస్‌మిస్‌ నీళ్లు తీసుకోవచ్చు.
– షుగర్‌ వున్నవారు మెంతిపొడి నీళ్లు, జీలకర నీళ్లు, నిమ్మరసం, గోరువెచ్చని నీరు ఒక గ్రాసు తీసుకోవచ్చు.
– ఆహారం తీసుకున్న వెంటనే టీ, కాఫీ తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారంలో ఐరన్‌ శరీరానికి అందదు.
– ప్రయాణ సమయాల్లో, భోజన సమయానికి ఇంటికి చేరుకోలేని సందర్భాల్లో ఆకలిగా ఉన్నప్పుడు టీ, కాఫీలకు బదులుగా మజ్జిగ, సూప్‌, జ్యూస్‌, కొబ్బరినీళ్లు, బాదంపాలు లాంటివి శ్రేయస్కరం.
– రోజూ ఆహారంలో భాగంగా పాలను తీసుకోవడం వల్ల స్త్రీలలో కాల్షియం, ప్రొటీన్‌ లోపాన్ని తగ్గించవచ్చు.
– ఎక్కువ మోతాదులో టీ, కాఫీలు తాగడంవల్ల ఐరన్‌ లోపాలు వస్తాయి.
– తగిన మోతాదులో తీసుకునే టీ, కాఫీ వలన అలసట తగ్గి మెదడు చురుకుగా పనిచేస్తుంది.

– పి.వాణి, 9959361180
Msc nutrition & DietiticsCheif dietician
11Am-8Pm
(consultation timings)