ఆరోగ్యంపై పానీయాల ప్రభావం

On health Effect of drinksఆరోగ్యంపై పానీయాల ప్రభావంప్రస్తుత జీవన శైలిలో పండ్ల రసాలు, మధుర పానీయాలు, కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ (సోడాలు) ప్రజల ఆహారపు అలవాట్లలో ప్రధాన భాగమయ్యాయి. వీటిని తాగడం వల్ల తక్షణ ఉల్లాసం లభించడమే కాకుండా, రుచిలో కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో ఇవి శరీర, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం…
పండ్లను నేరుగా తినడం కంటే జ్యూస్‌గా తాగడం సులభం. కానీ ఇవి కేవలం తక్షణ ఉల్లాసాన్ని మాత్రమే ఇస్తాయి. అయితే దీర్ఘకాలంలో శరీర, మానసిక వ్యాధుల ప్రమాదం పెంచుతాయి. అధిక చక్కెర కలిగిన ప్యాకేజ్డ్‌ ఫలరసాలు ఆరోగ్యానికి హానికరం. ఇవి కేవలం సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌ మాత్రమే అందిస్తాయి. మన శరీరంలో రక్త చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతాయి. కనుక జ్యూస్‌ కన్నా పండ్లను నేరుగా తినడం మంచిది.
మధుర పానీయాలు
మధుర పానీయాలు  అనేవి మధుర పదార్థాల నుండి తయారు చేస్తారు. వీటిలో సోడాలు, కూల్‌ డ్రింక్స్‌, ప్రిజర్వేటివ్‌ డ్రింక్స్‌ ఉంటాయి. వీటిలో అధిక చక్కెర, సింథటిక్‌ కలర్‌, రుచి కోసం కలిపే కృత్రిమ పదార్థాలు అధికంగా ఉంటాయి. ఒక కప్పు మధుర పానీయంలో సుమారు 6-10 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. వీటిని అతిగా తీసుకుంటే, అధిక బరువు (ఓబిసిటీ), టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులు, పంటి సమస్యలు సంభవించే ప్రమాదం ఉంటుంది. అధిక చక్కెర వల్ల శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాక శరీరంలో క్యాలరీలు పేరుకుపోయి కొవ్వు నిల్వలు పెరుగుతాయి.
సోడాలు
సోడాలు లేదా కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌లో చక్కెరతో పాటు, అధిక కర్బన డై ఆక్సైడ్‌ (జఉ2) గ్యాస్‌ కూడా ఉంటుంది. కనక సోడాలు తాగిన వెంటనే రిఫ్రెషింగ్‌ అనిపించినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి పెద్ద నష్టం చేస్తాయి. సోడాలు తాగడం వల్ల శరీరంలో పీహెచ్‌ స్థాయి తగ్గి, జీర్ణ సమస్యలు, ఎసిడిటీ పెరుగుతాయి.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
మధుర పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల, మెదడులో డోపమైన్‌ వంటి రసాయనాల ఉత్పత్తి పెరిగి మానసిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఆగ్రహం, డిప్రెషన్‌, మూడ్‌ స్వింగ్స్‌ వంటి సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి.
1.ఊబకాయం – బరువు పెరగడం
కారణం: ఈ పానీయాలలో అధిక చక్కెర ఉండడం వల్ల శరీరానికి అసలు పోషకాలు అందకుండా ఖాళీ క్యాలరీలు మాత్రమే అందుతాయి. ఫ్రక్టోజ్‌, ఓ సాధారణ స్వీటెనర్‌, కొవ్వు పెరుగుదలకు దారితీస్తుంది.
ప్రభావం: పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడం వల్ల మెటాబాలిక్‌ రుగ్మతలు, ఊబకాయం పెరుగుతాయి.
2. టైప్‌ 2 డయాబెటిస్‌
కారణం: తరచూ మధుర పానీయాలు తాగడం వల్ల ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడుతుంది.
ప్రభావం: రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, టైప్‌ 2 డయాబెటిస్‌ అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
3. గుండె సంబంధిత వ్యాధులు
కారణం: అధిక చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిసరైడ్‌ స్థాయులు పెరిగి, నణూ (సహజ మంచి కొలెస్ట్రాల్‌) తగ్గుతుంది
ప్రభావం: హైపర్‌టెన్షన్‌, గుండెపోటు, స్ట్రోక్‌ల వంటి హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
4. దంత సమస్యలు
కారణం: సోడాలు, మధుర పానీయాలలో ఉన్న చక్కెర, ఆమ్లాలు పళ్ళ ఎమల్నెల్‌ను కరిగించి, హానికర బ్యాక్టీరియాను పెంచుతాయి.
ప్రభావం: పళ్ళు పుచ్చిపోవడం, క్యావిటీస్‌, దంత సమస్యలు.
5. కాలేయ సమస్యలు
కారణం: అధిక ఫ్రక్టోజ్‌ లివర్‌లో ప్రాసెస్‌ అవుతుంది. అయితే దీని వల్ల నాన్‌ ఆల్కాలిక్‌ ఫ్యాట్‌ లివర్‌ డిసీజ్‌ (చీAఖీూణ)కి దారి తీస్తుంది.
ప్రభావం: ఫైబ్రోసిస్‌, హేపటిటీస్‌, ఫ్యాట్‌ లివర్‌ చివరికి సిరోసిస్‌.
6. జీర్ణ సమస్యలు
కారణం: కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ శరీరంలో ఎసిడిటీని పెంచుతాయి. దానివల్ల జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా దెబ్బతింటాయి.
ప్రభావం: గ్యాస్ట్రిక్‌ సమస్యలు, అసిడిటీ, జీర్ణాశయ ఆరోగ్యం తగ్గడం.
7. మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు
కారణం: అధిక చక్కెర నాడీ రసాయనాల (డోపమిన్‌, సెరటోనిన్‌) స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
ప్రభావం: మూడ్‌ స్వింగ్స్‌, డిప్రెషన్‌, ఆందోళన, మానసిక సామర్థ్యం తగ్గడం.
ఆరోగ్యకరమైన పోషకాహార మార్గదర్శకాలు
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314