మణిపూర్ ఘటనపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

– మణిపూర్‌ హింస కార్పొరేట్ల కోసమే సహజ వనరులను దోచిపెట్టే కుట్ర

– రిజర్వేషన్ల పేరుతో కుకీలు, మైథలీల మధ్య విద్వేషాల సృష్టి
నవతెలంగాణ -కంటేశ్వర్
మణిపూర్ ఘటనపై ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బుధవారం ధర్నా చౌక్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘాల ఐద్వా వృత్తిదారుల సంఘం నేతలు మాట్లాడుతూ.. సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్రలో భాగంగానే మణిపూర్‌లో రిజర్వేషన్ల పేరుతో హింసను మోడీ సర్కారు సృష్టించిందని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నేతలు విమర్శించారు మణిపూర్‌లో హింసను అరికట్టాలనీ, సాధాన పరిస్థితులను కల్పించాలని కోరుతూ నినాదాలు ఇచ్చారు . అనంతరం నూర్జహాన్ పెద్ది వెంకట్రాములు వెంకటేష్ సుజాత కృష్ణ మాట్లాడుతూ. 30 లక్షల జనాభా ఉన్న అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రంలో హింసను నివారించలేని డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఎందుకని ప్రశ్నించారు. కార్పొరేట్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు మణిపూర్‌ రాష్ట్రంలో ఆధిపత్యభావజాల శక్తులకు కొమ్ముకాస్తూ హింసను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. అక్కడ జరుగుతున్న హింస కుటుంబం కోసమే, భూమి కోసమే, సరిహద్దు వివాదంతోనే కాకుండా బీజేపీ హిందూత్వ వాదంతో ప్రేరేపించిన హింసాకాండ అన్నారు. విలువైన సహజ వనరుల మీద కన్నేసి తెగలైన కుకీలు, నాగాల హక్కుల మీద దాడి చేస్తున్నదన్నారు. అక్కడ జరుగుతున్న మతోన్మాద చర్యలు, మహిళలపై లైంగిక దాడులను, హింసను బయటి ప్రపంచానికి తెలియకుండా చేయడంలో భాగంగానే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసిందని విమర్శించారు. ఓవైపు ప్రపంచ దేశాల వేదికపై భారతదేశం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెబుతున్న మోడీ…మణిపూర్‌ ఘటనపై పార్లమెంట్‌లో చర్చించాలంటే ఎందుకు పారిపోతున్నారని నిలదీశారు. బీరేన్‌సింగ్‌ ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలకు, గిరిజనులకు ప్రత్యేకంగా ఉన్న హక్కులన్నింటినీ తొలగిస్తూ పోతున్నదని విమర్శించారు. ఆదివాసీలైన కుకీ, నాగాల హక్కులను హరించే ప్రయత్నంలో భాగంగానే మైదాన ప్రాంతాల్లోని మైథీలను ఎగదోస్తున్నదన్నారు. కుకీలు, నాగాలు బతుకుదెరువు దెబ్బతినటంతో పెద్దఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారని తెలిపారు. పోరాటంలో చైతన్యంగా పాల్గొంటున్న మహిళలపై సామూహిక లైంగికదాడులు చేస్తూ, యువకుల తలలు నరికి వేలాడదీస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలను నిరసిస్తూ ప్రజాతంత్ర వాదులంతా పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనం, కార్పొరేట్లకు లబ్ది చేకూర్చడంలో భాగంగానే మణిపూర్‌ హింసాకాండ జరుగుతున్నదన్నారు. బీజేపీ మతతత్వ, కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. బీరేన్‌సింగ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు దిగొచ్చి మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావాలన మణిపూర్‌లో ఎన్నికల ముందు మతోన్మాద చర్యలను ఎగదోసి దేశ వ్యాప్తంగా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నదని విమర్శించారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తుందని మణిపూర్‌ హింసాకాండను చూస్తే అర్థమవుతున్నదన్నారు. ఓ సైనికుడి భార్యకే పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితి ఉండటం సిగ్గుచేటన్నారు. బీజేపీ చెబుతున్న దేశభక్తి, భారత్‌మాతాకి జై నినాదాలన్నీ బూటకమేనని ప్రస్తుత ఘటనలను చూస్తే ఇట్టే అర్థమవుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్షురాలు కటారి లావణ్య సీఐటీయూ జిల్లా నాయకులు  రాములు వృత్తిదారుల సంఘం సాయిలు, తదితరులు పాల్గొన్నారు.