
జాతీయ రహదారి 63 బస్టాండ్ సమీపంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మెల నాగేశ్వరరావు మాట్లాడడం పట్ల బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు రైతుబంధు డబ్బులు ఇవ్వలేమని చెప్పడంతో రైతులను నట్టేట ముంచడమేనని, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్తారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం తమ తీరును మార్చుకొని రైతు బంధు డబ్బులను రైతు ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రుణమాఫీని సైతం సక్రమంగా పంపిణీ చేయని ప్రభుత్వం రైతుబంధు డబ్బులు కూడా రైతులకు ఇవ్వకుండా మోసం చేస్తోందని అన్నారు. తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు, రుణమాఫీ డబ్బులను తక్షణమే రైతు ఖాతాలలో జమ చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.