సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..

Efficacy of CM Revanth Reddy burnt..– ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య  యత్నం..
నవతెలంగాణ – వేములవాడ
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు గురువారం వేములవాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు  సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా  ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన బీఆర్ఎస్ నాయకులు రాము.. ఈ సందర్భంగా చైర్మన్ మాధవి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని, సీఎం స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటని వారు అన్నారు. తక్షణమే మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ  కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి,  కౌన్సిలర్లు నిమ్మ శెట్టి విజయ్, గోలీ మహేష్, మారం కుమార్, సిరిగిరి చందు, ప్యాక్స్ చైర్మన్లు బండ నరసయ్య, రామ్మోహన్ రావు,  మాజీ ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య,  సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, ఈర్లపల్లి రాజు,  మైలారం రాము, మంత సందీప్, లింగం రాకేష్, ప్రేమ్ చారి, రఫిక్, పర్వేజ్, సనుగుల మాజీ సర్పంచ్ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.