
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ రంగం సమస్యల పరిష్కారం కోసం మలి ఉద్యమం చేపట్టిన రైతులపై కేంద్ర ప్రభుత్వం కాల్పులకు పాల్పడటం అమానవీయ మని ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం బాధ్యులు గోకినపల్లి ప్రభాకర్,కంగాల కల్లయ్య మండిపడ్డారు. రైతుల ప్రాణాలను బలి తీసుకుంటే భారతదేశానికి మంచిది కాదని హితవు పలికారు. కాల్పుల్లో యువ రైతు శుఖ్ కరణ్ సింగ్ మృతికి నిరసనగా గురువారం సంఘం అధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మూడు రోడ్లు కూడలిలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు మృతికి కారణమైన మోదీ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని మాండ్ చేశారు. కార్యక్రమంలో గన్నిన రామకృష్ణ(సీపీఐ), గొంది లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.