నవతెలంగాణ – అశ్వారావుపేట
గుర్తించిన ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ని పేరాయిగూడెం పంచాయితీ లో ఆయన ఆదివారం స్థానిక సమస్యలు గుర్తింపు కోసం హలో శుభోదయం నిర్వహించారు. ఉదయం 7 గంటలు నుంచే ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు డ్రైనేజీలు కావాలని స్థానికులు అడగటంతో త్వరలోనే సమస్యలు పరిష్కరించి మౌలిక వసతుల విషయంలో తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలకు కట్టుబడి ఉన్నామని, సంక్షేమ పధకాలను లబ్ధిదారులకు పారదర్శకంగా అందిస్తామని, నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా తనని కలవ వచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,పీఆర్ డీఈ శ్రీధర్,ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,ఎంపీఈవో సోయం ప్రసాద్,కార్యదర్శి కోటమర్తి శ్రీరామ మూర్తి,కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు,జూపల్లి రమేష్,జూపల్లి ప్రమోద్, మండల పరిషత్ కో – ఆప్షన్ మాజీ సభ్యులు ఎస్.కే పాషా,మాజీ ఎం.పీ.టీ.సీ సభ్యులు మిండ హరిక్రిష్ణ లు పాల్గొన్నారు.