– నూతన చైర్మన్ కలకొండ బీరప్ప
– 30 మందితో ఆలయ కమిటీ ఎన్నిక
– ఆలయ వైస్ చైర్మెన్‌గా జమ్మ గుండాలు
నవతెలంగాణ-రంగారెడ్డిడెస్క్
అనుమానం ఆలయ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని నూతన చైర్మెన్‌గా ఎన్నికైన కలకొండ బీరప్ప అన్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని నక్కర్త మేడిపల్లిలో హనుమాన్ ఆలయ నూతన కమిటీని 30 మందితో ఎన్నుకున్నారు. ఆలయ వైస్ చైర్మెన్‌గా జమ్మ గుండాలుతో పాటు 30 మందితో కమిటీని వేయడం జరిగింది. అనంతరం ఆలయ నూతన కమిటీని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మెన్ మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతను అప్పగించిన అందరికీ పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో హనుమాన్ ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఏవిజి ఫౌండేషన్ చైర్మెన్ ఆడాల గణేష్, మాజీ ఉపసర్పంచ్ సింధం కృష్ణ, జమ్మ మహేష్, సింధం అంజయ్య, శ్రీను, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.