మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల అభివృద్ధికి కృషి

– టీజీఎంఆర్‌ఈఐఎస్‌ వైస్‌ చైర్మెన్‌ మహమ్మద్‌ ఫహీముద్దీన్‌ ఖురేషి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(టీజీఎంఆర్‌ఈఐఎస్‌) వైస్‌ చైర్మెన్‌ మహమ్మద్‌ ఫహీముద్దీన్‌ ఖురేషి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో తెలంగాణ మైనార్టీ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల ప్రిన్స్‌పాల్స్‌, రీజినల్‌ లేవల్‌ కో ఆర్డినేటర్లు(ఆర్‌ఎల్‌ఎస్‌), జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖురేషి మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా సంస్థలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్స్‌పాళ్లకు సూచించారు. ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించినందుకు అభినందించారు. ప్రధానో పాధ్యాయులు విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించాలని సూచిం చారు. టీజీఎంఆర్‌ పాఠశాలలు అన్ని విధాలుగా అగ్రస్థానంలో ఉండాలన్నారు. విద్యార్థులకు మంచి పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.