– యువజన విభాగం అధ్యక్షుడు చక్రహరి పురెేందర్
నవతెలంగాణ-తుర్కయాంజల్
భట్రాజు రంగారెడ్డిజిల్లా యువజన విభాగం శ్రేయస్సు కోసం కృషి చేస్తానని నూతనంగా అధ్యక్షుడుగా ఎన్నికైన చక్రహరి పురేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఇంజపూర్‌లోని భట్రాజు సంఘ భవనంలో యువజన, మహిళ విభాగం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనం తరం చదువులో ఉత్త మ ప్రతిభ కనబరిచిన 18 ఇంటర్ విద్యార్థులను ఘనంగా సన్మానించి పురస్కారాలు అందజే శారు. ఈ సందర్బంగా నూతనగా ఎన్నికైన అధ్యక్ష, కార్య దర్శులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామ న్నారు. సంఘం అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.
నూతన కార్యవర్గం: తెలంగాణ రాష్ట్ర భట్రాజుసంఘ తూర్పు రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా చక్రహరి పురెందర్ భట్, ప్రధాన కార్యదర్శిగా బాహటం వెంకట స్వా మి రాజు, మహిళావిభాగం అధ్యక్షురాలుగా సరస్వతి వెంకట లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా సరికొండ రుద్రాణి లను ఏకగ్రీవం గా ఎన్నిక య్యారు. ఈ కార్యక్రమంలో తూర్పు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బోల్లేపల్లి జగన్ మోహన్ రాజు, ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ రాజు, గౌరవ అధ్యక్షులు మురళీధర్ రాజు, రాష్ట్ర భట్రాజు సంఘ అధ్యక్షులు దేవరాజు విష్ణువర్ధన్ రాజు, ప్రధానకార్యదర్శి ప్రతుకంఠం పూర్ణచందర్ రాజు, తెలంగాణ భట్రాజు సంఘం యువత నర్సింగ రాజు తదితరులు పాల్గొన్నారు.