నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయిస్ సంస్థ (ఎఫ్‌ఐటీఈ) కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారంనాడిక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.
నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాల్లోని ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర శర్మ, రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ యాదవ్, ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయిస్ అధ్యక్షులు చుట్టారి వినోద్‌కుమార్, నాయకులు బాతూరి శ్రీరామ్, అవినీకాంత్ పాండే, కష్ణ తదితరులు పాల్గొన్నారు.