
నవతెలంగాణ – చిన్నకోడూరు
పేదరిక నిర్మూలన గ్రామాల సస్యశ్యామలమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు నిరంతరాయంగా అందిస్తుందని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ ఆదేశాలతో ఒక యూనిట్ కి 20గొర్లు1పొట్టేలు చొప్పున 121యూనిట్లు సిద్దిపేట జిల్లాకు అందులో 9 యూనిట్లు చంద్లాపూర్ గ్రామా గొల్ల కుర్మల సంక్షేమానికి కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి చేరిందని అన్నారు. నిరుపేదలకు బిసి బంద్ కుల పెద్దలు గ్రామ పెద్దల సమక్షంలో పారదర్శకంగా ఎంపిక చేసామని తెలిపారు. పేదరికం నిర్మూలనకు గ్రామాల్లో సస్యశ్యామలమే లక్ష్యంగా ముందుకు వెల్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందుతున్న లబ్దిదారులు వ్యవస్థాపకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని మల్లి గెలిపించాలని పిలుపునిచ్చారు. లబ్దిదారులు పెంపకం ఘననీయంగా పెరిగి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. మూగ జీవాలకు షెడ్ ల ఏర్పాటు మంత్రి హరీశ్ రావు ఘనత అని అన్నారు.
అపోహలు, అనుమానాలు వదలాలి: పోచబోయిన శ్రీహరి యాదవ్
– ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం చైర్మన్..
గొర్రెల కాపరులు 2వ విడత గొర్రెల పంపిణీపై అపోహలు, అనుమానాలు వదలాలి అన్నారు.మొదటి విడత లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. అల్పసంఖ్యాక వర్గాల(24యూనిట్లు లోపు) గ్రామాల్లో ముందు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 6700మంది డిడి కట్టినారనీ, వారికి 2నెలల్లో పంపిణీ చేస్తామని చెప్పారు. గొల్ల కుర్మల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, గొర్రెల యూనిట్లు నిరంతరం పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ జెడి జగత్ కుమార్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు వెంకటేశం, వెటర్నరీ డాక్టర్ మంజుల, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంటయ్య, సర్పంచ్ చంద్రకళ రవి గౌడ్, ఎంపీటీసీ దుర్గారెడ్డి, అల్లిపూర్ సొసైటీ డైరెక్టర్ భరత్, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు పాల్గొన్నారు.