జంగమ అర్చక సంఘ అభివృద్ధికి కృషి చెయ్యాలి

నవతెలంగాణ- రాజంపేట్
జంగం అర్చక సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్క జంగమ అర్చకుడు కృషి చేయాలని జంగమ అర్చక జిల్లా అధ్యక్షులు జంగం అవినాష్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం అర్చక సంఘసభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జంగమ అర్చక సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, అర్చకుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఈ కార్యక్రమంలో చర్చించారు. అనంతరం కీర్తిశేషులు జంగం శంకరప్ప జ్ఞాపకార్థం ఆయన కుమారులు సంతోష్ కుమార్, నాగభూషణం, గాంధారి వాస్తవ్యులు అర్చకులకు వైదిక ప్రయోగ రత్న పుస్తకాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, కోశాధికారి ప్రసాద్, జంగమ అర్చక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.