– స్పీకర్‌ను కలిసిన నార్సింగి నాయకులు
నవతెలంగాణ-గండిపేట్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని నార్సింగి నాయకులు పత్తి రాజు, కె రాజు అన్నారు. శనివారం నగరంలోని స్పీకర్ నివాసంలో వికరాబాద్ జిల్లా బంట్వారం జడ్పీటీసీ సంతోషరాజుతో కలిసి స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పత్తి రాజు మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తొలిసారిగా స్పీకర్ కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. నార్సింగిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మున్సిపాలిటీల అభివృద్ధి తీరుపై చర్చించారని తెలిపారు. జడ్పీటీసీ సంతోషరాజు, నాయకులు స్పీకర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.