
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పందిల్ల గ్రామంలోని శ్రీ మహా లింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతుందని ఆలయ అభివృద్దికి పందిల్ల ఇండస్ట్రీస్ యాజమాన్యం కృషి చేయాలని బుధవారం గ్రామ మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ కోరారు. ఆలయ అభివృద్ధికి వివిధ రంగాల వారు సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఇండస్ట్రీస్ యాజమాన్యం తమ వంతు సహకారం ఉంటే ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఇండస్ట్రీ యజమాన్యులు పాల్గొన్నారు.