ప్రభుత్వ ఇంటర్‌ విద్యారంగం అభివృద్ధికి కృషి చేయాలి

– ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత విద్యా రంగంలో కీలకమయిన ఇంటర్‌ విద్యారంగం అభివృద్ధికి అధ్యాపకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని చెన్నుపాటి భవన్‌లో తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌-475 రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు బాధ్యతగా పనిచేసి సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. క్రమబద్దీకరణకాని కాంట్రాక్ట్‌ అద్యాపకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. డాక్టర్‌ అందె సత్యం మాట్లాడుతూ అధ్యాపకులు సమాజానికి మోడల్‌గా ఉండాలన్నారు. సమాజంలోని సమస్యలను అధ్యయనం చేయాలని సూచించారు. సమావేశంలో టీజిజెఎల్‌ఏ475లోగా అవిష్కరణతోపాటు క్రమబద్దీకరణ కాని కాంట్రాక్టు అధ్యాపకులందిరినీ రెగ్యులర్‌ చేయాలనీ,ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్నభోజనం ప్రవేశపెట్టాలంటూ పలు తీర్మానాలు చేశారు.
నూతన కార్యవర్గం
నూతన కార్యవర్గం అధ్యక్షులుగా డాక్టర్‌ వి శ్రీనివాస్‌,వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె కుమారస్వామి, పి శోభన్‌బాబు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ దేవేందర్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె సురేశ్‌, కోశాదికారి ఎన్‌ శ్రీనివాస్‌తో పాటు ఐదుగురు ఉపాధ్యక్షులు,నలుగురు కార్యదర్శులు, ఐదుగురు మహిళా కార్యదర్ళులను ఎన్నుకున్నారు.