నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరిగేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల ఎస్సీ సెల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేయబోయే ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, పెన్షన్లు, తదితర సంక్షేమ పథకాల్లో పేదలకు, పేద దళితులకు, ప్రజలకు న్యాయం జరిగేలా మనం కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. ఈ సమావేశం అనంతరం భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి వారిని దళిత కాంగ్రెస్ పార్టీ 11 మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.