
నవతెలంగాణ – ఆర్మూర్
పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెరిగేందుకు ఉపాధ్యాయులు కృషి చేయడం అభినందనీయమని విజయ్ విద్యాసంస్థల అధినేత్రి డాక్టర్ అమృత లత అన్నారు. పట్టణంలోని విజయ్ హైస్కూల్లో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వశక్తితో ఏర్పాటు చేసిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన, వెజిటేబుల్ కార్వింగ్ లో కాయకూరలు, పండ్లు, గుడ్లను ఉపయోగించి వివిధ రకాల కళారూపాలు కాకరకాయతో మొసలీ, క్యారెట్ ,క్యాప్సికంతో తాటి చెట్లు, బీట్రూట్తో ఎలుక, బుడమకాయ ,,ద్రక్షతో ముళ్ళపంది, పుచ్చకాయతో పూలబుట్ట, తాబేలు, అల్లికల విభాగంలో – పూసలతో పర్సులు, చేతి గాజులు, కమ్మలు, ఇంటిలో సుందరీకరణకు ఉపయోగించే వివిద రకాల వస్తువులును తయారు చేసారు. వాటినన్నింటినీ ఆమె పరిశీలించి ప్రశ్నలకు జవాబులను రాబట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేయడం వల్ల పిల్లలలో దాగివున్న అంతర్గత శక్తులు బయటకి వస్తాయని, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటుకు తోడ్పాటు అందించిన ప్రధానోపాధ్యాయురాలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కవితాదివాకర్, ప్రైమరి క్లాస్ ఇంచార్జ్ ఎస్తర్ రాణి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.