నవతెలంగాణ – ఆర్మూర్
శాంతి భద్రతల పరిరక్షణకు నూతన ఏసీపీ గా పదవీ బాధ్యతలు చేపట్టిన బాస్వరెడ్డి కృషి చేయాలని జీ జీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేధన్ గుజరాతి అన్నారు. పట్టణ ఏ సి పి కార్యాలయంలో గురువారం రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు డి జే దయానంద్, మంచిర్యాల కిషన్ లు పూలమాల,శాలువా తో ఘనంగా సన్మానించి జ్ఞాపికార్థం అందచేసి ఆత్మీయ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపినారు. ఇ సందర్భంగా నివేధన్ మాట్లాడుతూ సబ్ డివిజన్లో ఎలాంటి అవంచానియ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ అయా కేసులలో ప్రజల యొక్క సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తూ తగిన న్యాయం చేయాలని వారు కొరినారు ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ తప్పనిసరి ప్రతి కేసులలో పటిష్టంగా విధులు నిర్వహిస్తామనీ వారు కొనియాడురు ఇట్టి సన్మానం చేసిన జి జి ఫౌండేషన్ ,రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు ..కార్యక్రమంలో రోటరీ ప్రతినిధి రాగి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.