
– సూర్యాపేట నియోజకవర్గం లో 258 చెక్కుల పంపిణి..
– మాజీ మంత్రి, సూర్యాపేట నియోజక వర్గం శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ గొప్పవరంగా మారిందని మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సోమవారం సూర్యాపేట నియోజకవర్గం లో సూర్యాపేట మున్సిపాల్టీ, రూరల్ మండలం లో 166 అలాగే చివ్వేంల మండలం లో 92 కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ సంబంధించిన 258 చెక్కులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, మున్సిపల్ చైర్ పర్సన్ పి అన్నపూర్ణ, వైస్ చైర్ పర్సన్ కిషోర్ లతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో లబ్ధిదారులకి ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాలు అర్హులకు అందాలని ఆదిశగా అధికారులు కృషి చేయాలని అన్నారు. తదుపరి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళ సంక్షేమానికి అధిక ప్రాధాన్యతని ఇస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని సూర్యాపేట నియోజకవర్గం లో 258 మందికి 2,58,29,928 విలువ గల చెక్కులను లబ్ధిదారులకి ఈ సందర్బంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్ డి ఓ వేణు మాధవ్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.