విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి

Efforts should be made to make the students betterనవతెలంగాణ – ఆర్మూర్ 
విద్యార్థిని విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని స్టేట్ రిసోర్స్ పర్సన్ చక్రవర్తుల శ్రీనివాస్ అన్నారు. మండల ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విజయస్పూర్థి కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలోని కోటర్మూర్  జి ఆర్ గార్డెన్ లో చాలా ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో స్టేట్ రిసోర్స్ పెర్సన్స్, టెక్స్ట్ బుక్ రైటర్ చక్రవర్తుల శ్రీనివాస్  శశికలాదర్, గౌస్ పాషా తదితరులు పాల్గొని విద్యార్థులకు సబ్జెక్టు లోని మెలకువలు, మానసికంగా దృఢంగా ఉండాలంటే మన జీవన విధానం ఏ విధంగా ఉండలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు శ్రీ భరత్ చంద్ర మల్లయ్య, కార్యదర్శి శ్రీ విద్య ప్రవీణ్ పవార్ మరియు ప్రోగ్రాం కన్వీనర్ లు శ్రీ భాశిత సుందర్ , కాంతి గంగారెడ్డి, మానస గణేష్ , నలందా ప్రసాద్, కోశాధికారి స్కాలర్స్ వేణు, జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.