వినికిడి లోపం నివారణకు కృషి చేయాలి

– హెలెన్‌ కెల్లర్‌ జయంతి స్మారక సెమినార్‌లో వక్తలు
–  పీహెచ్‌సీల్లో పరీక్షలు చేయాలంటూ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వినికిడి లోపం నివారణ కోసం ప్రత్యేక కృషి చేయాలనీ, మానసిక వైకల్యం పెరగకుండా చర్యలు చేపట్టాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెలెన్‌ కెల్లర్‌ 143వ జయంతి సంద ర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజ న్యంతో హెలెన్‌ కెల్లర్‌ విద్యా సంస్థలు, ఎన్‌పీఆర్‌డీ, టీఏఎస్‌ఎల్‌పీఏ ఆధ్వర్యంలో ‘వినికిడి లోపం, ఆటిజం, మానసిక వైకల్యం తీసుకోవాల్సిన జాగ్రత్త లు’ అనే అంశంపై స్మారక సెమినార్‌ను నిర్వహించారు.
వికలాంగుల వాయిస్‌ మాస పత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. హెలెన్‌ కెల్లర్‌ విద్యా సంస్థల డైరెక్టర్‌ ఎం శశిధర్‌ రెడ్డి, తెలంగాణ ఆడియా లజిస్‌ట స్పీచ్‌ లాంగ్వేజ్‌ పథాలజిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె నాగేందర్‌, ఇమధ్‌ ఖాన్‌ రుమాని, క్లినికల్‌ సైకాలజిస్ట్‌ శ్రీ పూజ సిద్ధంశెట్టి, ప్రముఖ ఆడియలాజిస్ట్‌ సుజన్‌, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య, కేంద్ర కమిటీ సభ్యులు అర్‌ వెంకటేష్‌, జే రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యశోద, రాష్ట్ర సహాయ కార్యదర్శలు ఉపేందర్‌, దశరథ్‌, బాలిశ్వర్‌ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హెలెన్‌ కెల్లర్‌ 1880 జూన్‌ 27న అమెరికాలో జన్మించారని తెలిపారు. 19నెల్ల వయస్సులోనే ఆమె తీవ్రమైన అనారోగ్యం కారణంగా దృష్టినీ, వినికిడి శక్తిని కోల్పోయింద న్నారు.1902లోనే ”స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌” అనే పుస్తకాన్ని ప్రచురించి చరిత్ర సృష్టించిందని చెప్పారు. చూపు లేకపోయినా, మాట వినికిడి లోపం ఉన్నప్ప టికీ ఏమాత్రం భయపడకుండా వికలాంగులకు ఉన్న హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిం చడం కోసం, ఆత్మస్థైర్యం నింపేందుకు 39 దేశాలు పర్యటించా రని చెప్పారు.. అమెరికన్‌ సోషలిస్ట్‌ పార్టీలో చేరి వికలాంగులు, మహిళలు, బాలలు, కార్మికవర్గ హక్కులు, సంక్షేమ పై అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారన్నారు. వినికిడి లోపం కలిగిన వారి పట్ల సమాజంలో తీవ్రమైన వివక్షత కొనసాగు తున్నదని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వినికిడి పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో వాటిని చేర్చడం ద్వారా ఎక్కువ మందికి వైద్యం అందుబాటు లోకి వస్తుందన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం సామూహిక ప్రాంతాలనేవి బధిరులు వినియోగించు కునే విధంగా ఉండాలని గుర్తుచేశారు. 2018 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ప్రాంతాలు వికలాంగుల వినియోగించుకునే విధంగా అందుబాటులోకి తెస్తామని చెప్పినప్పటికీ అది జరగలేదని విమర్శించారు. 2023 నాటికి కూడా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయకపోవటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 5 లక్షల మంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారని చెప్పారు. దాన్ని గుర్తిస్తే నివారించడం సులువవుతందని తెలిపారు.
ఈ సమస్యతో బాధపడుతున్న వారికి తగిన వైద్యసదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ మెంటల్లి హ్యాండిక్యాప (ఎన్‌ఐఎంహెచ్‌) ఉన్నప్పటికీ.. అందులో తగిన సిబ్బందీ, పరికరాలు లేవని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడేండ్ల వయస్సు కలిగిన పిల్లలకు ఆటిజం పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా వారు కోరారు. వారికోసం ప్రభుత్వం ఉచితంగా థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆటిజం సమస్య కలిగిన పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆటిజం స్పెషలిస్టులను నియమించా లనీ, పెరుగుతున్న మానసిక సమస్యలలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.