నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆదివారం మండల కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్ ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ రావు కు విన్నవించారు. మండల కేంద్రంలో గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయించాలని, గొల్లపల్లి, కన్నాపూర్ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, రామారెడ్డి తో పాటు గోకుల్ తండాలో నీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గారికి విన్నవించగా, ఆయన డిపో మేనేజర్ చరవాణి బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కు సూచించినట్టు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పడితే గతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారని, నీటి సమస్యల పరిష్కారం త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు లక్ష్మా గౌడ్ తెలిపారు.