– రైతుల విన్నపం మేరకు వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ మంజూరు
నవతెలంగాణ-ఆమనగల్
రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని మద్దెలకుంట తాండా రైతుల సౌకర్యార్థం వ్యవసాయ పొలంలో ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం మాజీ సర్పంచ్ భారతమ్మ విఠలయ్య గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ రైతులకు అవసరమైన ట్రాన్స్ ఫార్మర్ ను వెంటనే ఏర్పాటు చేయాలని సంబందిత విద్యుత్ అధికారులకు సూచించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవిలో ఉన్న లేకున్నా గ్రామస్తులకు వెన్నంటి ఉంటూ వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం ప్రజా ప్రతినిధుల కనీస కర్తవ్యమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.