శాంతిభద్రతల పరిరక్షణకు కృషి: ఎస్సై

– నవతెలంగాణతో ముఖాముఖి: ఎస్సై వీరబాబు
సవతెలంగాణ – పెద్దవూర
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్పై వీరబాబు అన్నారు. బుధవారం ఆయన నవతెలంగాణతో ముఖాముఖితో మాట్లాడారు.
1. రిపోర్టర్ : స్టేషన్ పరిధిలో గ్రామాలెన్ని ఉన్నాయి.? నమస్యాత్మకమైనవి ఏమైనా ఉన్నాయా?
ఎస్సై వీరబాబు: మండలంలో 26 గ్రామ పంచాయతీలు, మరో 26 అవాస గ్రామాలు వున్నాయి. మండలం లో సమస్యాత్మక గ్రామాలు తుంగతుర్తి, గేమ్యానాయక్ తండా, సమస్యత్మాక గ్రామాలు
2. రిపోర్టర్ : ఎన్ని కేసులు నమోదయ్యాయి..? ఎన్ని పరిష్కరించబడ్డాయి?
ఎస్సై వీరబాబు: ఈ మధ్య నేను వచ్చిన ప్పటినుంచి మూడు కేసులు వచ్చాయి అవి పరిష్కారం అయ్యాయి.
3. రిపోర్టర్ : స్టేషన్ పరిధిలో క్రైం రేట్ ఎలా ఉంది ?
ఎస్సై వీరబాబు: గతం కంటే చాలా తగ్గింది. నిరంతరం పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తిస్తున్నాం.
4. రిపోర్టర్ : హైవేపై వేగంగా వెళ్లే వాహనాలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
ఎస్సై వీరబాబు: వాహనాల వేగాన్ని గమనించి వాటిని నివారిస్తున్నాం. చాలా వరకు చర్యలు తీసుకుంటున్నాము.
5. రిపోర్టర్ : రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
ఎస్సై వీరబాబు: రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం, బాధ్యతా రహితంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారిపై, ఎంవీఎం యాక్టు ద్వారా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాము.
6. రిపోర్టర్ : ఫ్రెండ్లి పోలీస్ కార్యక్రమం అమలవుతుందా..?
ఎస్సై వీరబాబు: ఫ్రెండ్లీ పోలీసు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల నుంచి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నాం వారి సమస్యలపై స్పందిస్తున్నాం..
7. రిపోర్టర్ : గ్రామాల్లో వీపీఓల పనితీరు ఎలా ఉంది?
ఎస్సై వీరబాబు: గ్రామాల్లో వీపీఓల వల్ల ప్రజలతో పోలీసులకు మధ్య సత్సంబంధాలు పెరిగాయి. స్వచ్ఛందంగా ప్రజలే గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్య కలాపాలు, ఇసుక అక్రమ రవాణా, పేకాట వంటి వాటిపై ఫిర్యాదలు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వారు భాగస్వాములవుతున్నారు.
8. రిపోర్టర్ :  క్రైం రేట్ నివారణకు చేపడుతున్న చర్యలు…?
ఎస్సై వీరబాబు: ఇటీవల క్రైం రేట్ చాలా తగ్గింది. దీనికి గాను బైండోవర్, ముందస్తు అరెస్టులతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
9. రిపోర్టర్ : డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఏమైనా నమోదు చేశారా?
ఎస్సై వీరబాబు: డ్రంకెన్ డ్రైవ్ వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని నివారణకు కేసులు నమోదు చేస్తున్నాం.జరిమానాలు విదిస్తున్నాము.
10. రిపోర్టర్ : ఇసుక అక్రమ రవాణా పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
ఎస్సై వీరబాబు: అధికారం అడ్డు పెట్టుకొని ఆక్రమంగా రవాణా చేసే వారిపై నిఘా పెట్టాం. కేసులు నమోదు చేస్తున్నాం.
ఈ 10 రోజుల కాలంలో రెండు కేసులు నమోదు చేశాము. ఇసుక తరలించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం.
11. రిపోర్టర్ : స్టూడెంట్ పోలీస్ కేడెట్లో భాగంగా మండలంలో స్కూళ్లు ఏమైనా ఎంపికయ్యాయా?
ఎస్సై వీరబాబు: మండలంలో ఎంపిక కాలేదు. కానీ జిల్లాలో మాత్రం ఎస్పీసీలో భాగంగా నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయి. వారికి ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. దీని వల్ల విద్యార్థి దశలోనే పోలీసుల పట్ల అవగాహన, అభినూనం పెరుగుతోంది. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
12. రిపోర్టర్ : స్టేషన్ పరిధిలో ఇంకేమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా?
ఎస్సై వీరబాబు: మండలంలోని గ్రామాల్లో జనమైత్రి పోలీసు ఆధ్వర్యంలో మహిళల వేధింపులు, వివక్ష, రోడ్డు భద్రత,వంటి కార్యక్రమాల పై అవగాహన ఇస్తున్నాము.
13. రిపోర్టర్ : ప్రస్తుతం ఎన్నికలకోడ్ అమలులో వుంది కదా, అయితే ఎలా అమలు చేయబోతున్నారు.?
ఎస్సై వీరబాబు: పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో వుంది. దాని ప్రకారం ఉన్నతాది కారుల ఆదేశాల మేరకు
ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నాము. గ్రామాల్లో బెల్టు షాపులు నడపటకుండా అవగాహన కల్పించాము.
14. రిపోర్టర్ : శాంతి భద్రతల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
ఎస్సై వీరబాబు: శాంతి భద్రతలనివారణకు మండలం లో సాగర్ ఎక్స్ రోడ్డు వద్ద, వెల్మగూడడెం,పోతునూరు స్టేజీ వద్ద, పెద్దగూడెం స్టేజీ వద్ద, ముసలమ్మ చెట్టు స్టేజీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పటిష్టమైన చర్యలు తీసుకుంటాము.
15. రిపోర్టర్ :  చివరగా మండల ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి..?
ఎస్సై వీరబాబు: మండల పరిధిలోని గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానితులు సంచరించినట్లు తెలిసినా, చూసినా వెంటనే పోలీస్ స్టేషన్ కు ఫోన్ ద్వారా గాని లేదా 100 నంబర్ కు ఫోన్ చేసి గానీ తెలియజేయాలి. వెంటనే స్పందిస్తాం.