– టీ పీసీసీ ఓబీసీ వైస్ చైర్మన్ అడపా హారికా నాయుడు
నవతెలంగాణ – అశ్వారావుపేట
బీసీ గురుకులాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వ అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని టీ పీసీసీ ఓబీసీ వైస్ చైర్మన్ అడపా హారికా నాయడు తెలిపారు. మహాత్మా జ్యోతి రావు ఫూలే తెలంగాణ బీసీ గురుకులాల విద్యార్ధిని లు ద్వారా అందిన ఫిర్యాదులపై ఆమె మంగళవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ఎంజేపీ బీసీ గురుకులం బాలికలు,బాలురు పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు.నేరుగా దృష్టికి వచ్చిన సమస్యలపై పరిష్కార చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా సమస్యలు,సౌకర్యాలు,విద్యా ప్రమాణాలపై విద్యార్థులతో మాట్లాడారు.ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చని,ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ముఖ్యంగా బాలికల్లో ఆత్మ ధైర్యం కల్పించేందుకే బీసీ కమిటీ పని చేస్తుందని చెప్పారు. అక్రమాలు,కల్తీ వంటి ఇతర సమస్యలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరీక్షించారు.గురుకులాల నిర్వహణలో అశ్రద్ద ఉండొద్దని ప్రిన్సిపల్ నిరోషా కు ఆదేశించారు.ఆమె వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మ రాంబాబు,నాయకులు జూపల్లి ప్రమోద్,తగరం ముత్తయ్య తదితరులు ఉన్నారు.