– డాక్టర్ కిరణ్ మాదాల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్యుల సమస్యల పరిష్కారం కోసం అందర్నీ కలుపుకుని కృషి చేస్తామని ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ మాదాల తెలిపారు. ఆదివారం తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం ఎన్నికల ఫలితాలను రాష్ట్ర స్థాయి సమావేశంలో వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన వారు 2024 నుంచి 2026 వరకు ఆయా పదవుల్లో ఉండనున్నారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ కిరణ్ కుమార్ బోల్లేపాక, సెక్రటరీ జనరల్‌గా డాక్టర్ కిరణ్ మాదల, కోశాదికారిగా డాక్టర్ ఎల్.రమేష్, ఉపాద్యక్షులుగా డాక్టర్ కిరణ్ ప్రకాష్‌తో పాటు ఏడు జోన్లకు ప్రాంతీయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కిరణ్ మాదాల మాట్లాడుతూ తమ సంఘం ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అధ్యక్షులు డాక్టర్ కిరణ్ బొల్లేపాక మాట్లాడుతూ బోదనా వైద్యుల బదిలీలు, వైద్యుల వేతన స్థిరీకరణ తదితర సమస్యల సాధనకు కృషి చేయనున్నట్టు తెలిపారు.