ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి 

Efforts to solve the problems of teachers– పి ఆర్ టి యు టీఎస్ జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ఉపాధ్యాయ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని పి ఆర్ టి యు టీఎస్ జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ అన్నారు. శుక్రవారం పి ఆర్ టి యు టిఎస్ మండల అధ్యక్షులు పంజా రాజమల్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు పి ఆర్ టి యు  సంఘానికి ఉపాద్యాయులు అండగా ఉండాలని కోరారు. అనంతరం ఎన్నికల అధికారి ఎడబోయిన మల్లారెడ్డి సమక్షంలో నూతన మండల కమిటీ ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షులుగా కొలుగూరి తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ప్రతాప రాజయ్య, అసోసియేట్ అధ్యక్షులుగా ఉప్పుల వేణుగోపాల్, మహిళా ఉపాధ్యక్షులుగా అరుణాదేవి, మహిళా కార్యదర్శిగా కె లలిత, కార్యదర్శిగా వెంకట మల్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు, ఇంద్రసేనారెడ్డి, సంఘ నాయకులు లాఉద్య కిషన్ నాయక్ బాల్ రెడ్డి, రేమిడి లింగారెడ్డి, కొండి రవీందర్ సాదుల రవీందర్, లకావత్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.