సీపీఐ(ఎం)ను గెలిపిస్తే ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి

సీపీఐ(ఎం)ను గెలిపిస్తే ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి– మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న బీజేపీని ఓడించాలి : సీపీఐ(ఎం) భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌
– లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు
నవతెలంగాణ-యాచారం
పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఐ(ఎం)ను గెలిపిస్తే నియోజకవర్గంలో పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తామని ఆ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్‌ ఎస్సార్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన పార్టీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో శివన్నగూడ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ 25 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని అన్నారు. నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి, చిట్యాల, కట్టంగూర్‌, తదితర మండలాలకు సాగు నీరు ఎంత ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పదవు లను పాలకవర్గాలు ప్రజా ప్రయోజ నాలకు ఉపయోగించ కుండా తమ స్వార్ధ రాజకీయాల కోసం వాడుతున్నారని ఆరోపిం చారు. గతంలో ఎంపీగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంతాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి సంక్షేమాన్ని విస్మరించారని తెలిపారు. అందుకే దేశంలో బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలంతా సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, డి.జగదీష్‌, మండల కార్యదర్శి అలంపల్లి నరసింహ, మండల కమిటీ సభ్యులు పి.అంజయ్య, పెండ్యాల బ్రహ్మయ్య, చందు నాయక్‌, ఏ.జంగయ్య, అమీర్‌పేట మల్లేష్‌, తావునాయక్‌, ఎంజే వినోద్‌ కుమార్‌, పిరాటి వెంకటయ్య, ఉడు తల జంగయ్య, శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు, పాల్గొన్నారు.