– మహిళా హక్కులు, పిల్లల హక్కులు కాపాడంలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వద్దు
– అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
– కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సక్షేమశాఖ అధికారులతో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని దాదాపు 59 అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతులు సరిగ్గా లేవని ఆయా అంగన్వాడి కేంద్రాల్లో సరియైన వసతుల కల్పనకి కృషి చేస్తానని అన్నారు. గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్ వాడిల భద్యత అని గుర్తు చేశారు. మహిళా హక్కులు, పిల్లల హక్కులు కాపాడంలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వద్దనీ అన్నారు. అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.