నిధుల మంజూరుకు కృషి చేస్తా

నవతెలంగాణ – వీణవంక
వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు, చెక్ డ్యాం మరమ్మతు పనుల కోసం నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కనపర్తి-వీణవంక రోడ్డు తెగిపోగా ఆ  రోడ్డును, బ్రాహ్మణపల్లిలో తెగిపోయిన చెక్ డ్యాంను ఆయన స్థానిక బీజేపీ నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు రోడ్లు తెగిపోవడంతో పాటు పంటపొలాలు కొట్టుకుపోయి ఇసుక మేటలు వారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బేతిగల్ ఎంపీటీసీ మోరె స్వామి, నాయకులు  మాడ గౌతమ్ రెడ్డి, రామిడి ఆదిరెడ్డి, సీహెచ్ నర్సింహారాజు, సంపత్ రావు, ఆకుల రాజేందర్, గాలేటి సురేందర్ రెడ్డి, గణపతి, కొండల్ రెడ్డి, నరేష్, పెద్ది మల్లారెడ్డి, మోరె స్వామి తదితరులు పాల్గొన్నారు.