నష్టంతో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు అందించలేము..

Eggs cannot be served at lunch due to loss.– మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటియుసి

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మూడు రూపాయల నష్టంతో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు విద్యార్థులకు అందించలేమని మధ్యాహ్న భోజన కార్మికులు అన్నారు. సోమవారం  తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్, (ఏఐటియుసి) రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా మండల కేంద్రములో గల మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మండల విద్యాధికారి కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్  మాట్లాడుతూ కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచకుండా విద్యార్థులకు రెండు కూరలు మూడు కోడిగుడ్లు ఎలా అందిస్తారు అన్నారు దానితో పాటు కోడి గుడ్ల ధరలైతే కొండెక్కి కూర్చున్న సమయంలో మూడు రూపాయల నష్టం తో ఎలా అందించాలని అన్నారు అందుకే కోడిగుడ్లు పూర్తిగా ప్రభుత్వమే సరఫరా చేయాలని అలా చేయలేని పక్షంలో కోడిగుడ్లు నేటి నుండి పాఠశాలలో అందించ లేమని స్పష్టం చేసారు ఇంకా అనేక సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామల రమ,పి సరోజన,ఆడెపు లక్ష్మి,గోపిదాసు నిర్మల,స్వరూప,ఉమ, సమ్మక్క,స్వరూప,భారతమ్మ,మల్లక్క, మునెమ్మ,కొమురమ్మ,కుమారి,సేరి సమ్మక్క స్వప్న,కాయితాల కుమారి తదితరులు పాల్గొన్నారు.