
ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రంజాన్ మాసం గత నెల మొదటి వారంలో ప్రారంభమై ఉపవాస దీక్షలు దానధర్మాలు ఆధ్యాత్మిక సందేశాలు మహమ్మద్ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల ప్రవచనాలతో నెల రోజులుగా సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం కనీసం ఉమ్మి కూడా మింగకుండ వయసుతో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ముసలి వారు సైతం భక్తిశ్రద్ధలతో కఠిన దీక్షను చేసిన ముస్లిం సోదరులకు బుధవారం చంద్రవంక దర్శనంతో మాసం ముగిసింది. గురువారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను మండలంలోని ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రం కేశవపట్నం గ్రామంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు రంజాన్ పర్వదినం సందర్భంగా పండుగ గొప్పతనం, సమాజంలో మనిషి జీవనవిధానం, ప్రార్థనల సారాంశం, ముస్లింలు పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై ప్రార్థనల అనంతరం మతపెద్దలు వివరించారు.