నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని బోర్గం (పి) గ్రామంలో గల ఒక ప్రైవేట్ హాల్ లో బుధవారం రోజున. ఇంటి దీపం ప్రొడ్యూసర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ యొక్క ఎనిమిదవ మహాజనసభ సంఘం యొక్క మేనేజర్ లలిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సంఘం యొక్క ఆదాయ వ్యాయాలను మేనేజర్ లలిత వివరిస్తూ ఈ సంఘంలో 1876 మంది ఖాతాదారులు ఉన్నారని, ఇప్పటివరకు ఒక కోటి రూ.50 లక్షలు రూపాయలను రుణాలుగా ఇవ్వడం ఇవ్వడం జరిగిందని గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి రూ.7,50,000 రూపాయలు సంఘానికి రాబడి చేకూరిందని ఆమె తెలిపారు. ఈ సంఘం అభివృద్ధి పయనంలో నడుస్తుందంటే ప్రతి సంఘ సభ్యురాలు యొక్క శ్రమ ఉందని అలాగే మా సంఘం యొక్క అధ్యక్షురాలు మరియు ఉపాధ్యక్షులు, మరియు డైరెక్టర్ల సలహాలు సూచనలు తీసుకొని మరింత లాభాల్లోకి చేకూరే విధంగా చూస్తామని ఆమె తెలిపారు. సంఘం సభ్యులందరూ మేనేజర్ లలితకు అభినందించారు. అలాగే ఈ సంఘ సమావేశానికి ముఖ్యఅతిథిగా మోపాల్ మండల వ్యవసాయ అధికారి రవీందర్ హాజరవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సంఘ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడవారు తలుచుకుంటే అసాధ్యమైన దానినీ కూడా సుసాధ్యం చేయగలే శక్తి వారిలో ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే ముఖ్యంగా విత్తన కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అక్కడికి వచ్చిన సంఘం సభ్యులకు తెలియపరుస్తూ కచ్చితంగా లూజుగా ఉన్న విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దని అలాగే కొనుగోలు చేసిన సమయంలో కచ్చితంగా రసీదును పొందాలని విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని, మరియు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని, అలాగే కొనుగోలు చేసే సమయంలో లేబుల్ ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. రైతులు విత్తనాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి అవగాహన కార్యక్రమాలను చేపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో జేబన్న సంఘ అధ్యక్షులు బుచ్చిగంగు, బాలామణి చిన్నుబాయి తదితరులు పాల్గొన్నారు.