కర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు”ఎనిమియ ముక్తి భారత్ “టెస్టులు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని కర్లపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు శనివారం  ములుగు జిల్లాకేంద్రం వైద్య బృందం ఎనిమియ ముక్తి భారత్ టెస్టులు 8,9,10 వ, తరగతి విద్యార్థులకు నిర్వహించారు. ఈటెస్టులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీ.కల్తి. శ్రీనివాస్ , పాఠశాల ఏ.ఎన్, ఎం సమక్షంలో నిర్వహించారు హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న విద్యార్థులకు మాత్రలు ఇవ్వడం జరిగింది, వివిధ చర్మవ్యాధులు, హార్ట్ సమస్యలు, చెవి సమస్యలు, ప్రత్యేక అవసరాలుగల విద్యార్థుల వివరాలు తీసుకుని తదుపరి వారికి చికిత్సకు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈకార్యక్రమంలో ఉపాధ్యాయలు,విద్యార్థులు వైద్య బృందం పాల్గొన్నారు.