ఏక్‌ దమ్‌ ఏక్‌ దమ్‌

రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ చిత్ర మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్‌ సింగిల్‌ ‘ఏక్‌ దమ్‌ ఏక్‌ దమ్‌’ ఈనెల 5న విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో రవితేజ, నూపూర్‌ సనన్‌ రెట్రో అవతార్‌లలో కనిపించడం ఆకట్టుకుంది. జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్‌ దండయాత్ర గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన లభించింది. వరుసగా పాన్‌ ఇండియా బ్లాక్‌ బస్టర్స్‌ ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2’ చిత్రాలను రూపొందించిన అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్‌ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 20న విడుదల చేస్తున్నారు.