రవితేజ టైటిల్ రోల్‌లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రం నుంచి మంగళవారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘ఏక్ దమ్ ఏక్‌దమ్’ను హిందీతో కలిసి నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్‌లను గ్రాండ్‌గా ప్రారంభించారు. ‘సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ తన ఇన్‌స్ట్రుమెంటేషన్, కంపోజిషన్‌తో పాటకు రెట్రో అనుభూతిని తెచ్చారు. భాస్కరభట్ల సాహిత్యం నేటివిటీని జోడించగా, అనురాగ్ కులకర్ణి అద్భుతంగా అలపించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో తన ప్రేయసి నూపుర్ సనన్‌ని ఆట పట్టిస్తూ రవితేజ కనిపించారు. ట్రాక్‌లోని ఎనర్జిటిక్ బీట్‌లకు సరిగ్గా సరిపోయే ఎలక్ట్రిఫైయింగ్, ట్రెండీ హుక్ స్టెప్‌ను శేఖర్ మాస్టర్ క్రియేట్ చేశారు’ అని చిత్ర బృందం తెలిపింది. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో కథా నాయిక. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.