నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో 2024-2025 విద్యా సంవత్సరమునకు గాను 6వ తరగతిలో గల సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించబడుతున్న ప్రవేశ పరీక్షకు ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థిని, విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నమని
ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ప్రారంభ తేదీ( 22.02.2024 దరఖాస్తు ఫారం ఆన్లైన్లో సమర్పించుటకు చివరి తేదీ (22.03.2024.)ప్రవేశ పరీక్ష తేదీ (21.04.2024) ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేయబడుతుందని, పూర్తి వివరాలకు https://tsemrs.telangana.gov.in వెబ్ సైటులో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస్ తెలిపారు.