వికలాంగుల హక్కుల సాధన కోసం ఏకంకండి: గిద్దె రాజేష్

నవతెలంగాణ –  తుంగతుర్తి
వికలాంగుల హక్కుల ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా, ముందుకు సాగుతున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బలోపేతానికి సంఘం నాయకులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో నిర్వహించిన మండల నూతన కమిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షులుగా గుండాల కొమరయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ గా వడ్లకొండ మధురాంరెడ్డిని ఏకగ్రీవంగా నియమించి మాట్లాడారు. ఈ సందర్భంగా 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో వికలాంగుల సమస్యలపై చట్టసభల్లో మాట్లాడటానికి నాయకులు కరువయ్యారని అన్నారు. వికలాంగుల సమస్యలు పరిష్కారం కావాలంటే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ సలహాదారు బ్రహ్మచారి ,గోపి, రఫీ తదితరులు పాల్గొన్నారు..