పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య

నవతెలంగాణ-భిక్కనూర్
పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, స్థానికులు, కుటుంబీకులు, పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన సాజిద్ (60) గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా కుటుంబీకులు గమనించి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మరణించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.