నవతెలంగాణ – నవీపేట్: మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు పెద్ద సాయిలు (61) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామానికి చెందిన సాయిలు టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఈనెల 5 వ తేదీన నవీపేట్ కు వచ్చి తిరిగి వెళుతుండగా బస్సును ఢీకొని గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని ఆసుపత్రిలలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య వీరలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై వినయ్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.