
ప్రభుత్వ వైయవృద్ధుల ఆశ్రమం నుండి వయోవృద్ధులు విహారయాత్రకు వెళ్లారు. మండలంలోని ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం మండే పల్లి, ఎల్లారెడ్డి పేట కి చెందిన వృద్ధులు బుధవారం గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు కు విహారయాత్రకు వెళ్లి వనభోజనాలను చేశారు. ప్రభుత్వం,స్వచ్ఛంద సంస్థ అయిన సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం మండేపల్లి, ఎల్లారెడ్డిపేట లోని వృద్ధులను విహారయాత్ర వినోదం, వనభోజనాల కొరకు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వాహకులు వారిని విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ఉంటున్న వయవృద్ధులను ఇప్పటివరకు హనుమాన్ సినిమాకి, నాంపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దర్శనం కొరకు తీసుకొని వెళ్లడం జరిగిందనీ నిర్వాహకులు తెలిపారు. మనేరు ను చూసి వృద్ధులు సంతోషం వ్యక్త పరిచారు. వృద్ధులు అందరూ జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.