– వివిధ విభాగాల్లో నాయకుల ఎన్నిక
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
భారత దేశంలో రాజ్యాంగ బద్ధం గా ఎన్నికలు ఏవిధంగా జరుగుతాయి. నాయకులను ఏవిధంగా ఎన్ను కుంటారో విద్యార్థులకు వివరంగా వివరించారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గంలోని నాగార్జున హై స్కూల్‌లో బ్యాలెట్ రూపంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఇందులో హెడ్‌బారు, హెడ్ గర్ల్, కల్చరర్ క్యాప్టెన్, స్పోర్ట్స్, డిసిప్లేన్ క్యాప్తన్‌లకు ఎన్నికలు నిర్వ హించగా విద్యార్థులదరు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. ఇందులో 10వ తరగతి విద్యార్థి హేమంత్ కుమార్ 397 ఓట్ల మెజారిటీతో హెడ్‌బారుగా, 220 ఓట్ల మెజారిటీతో దేవికశ్రీ హెడ్ గర్ల్‌గా గెలుపొందారు. స్పోర్ట్స్ క్యాప్టన్‌గా కిరణ్ కుమార్, డిసిప్లేన్ క్యాప్టన్‌గా సాయిరాం రెడ్డి, కల్చరర్ క్యాప్టన్‌గా షాన వాజ్‌లు గెలుపొం దారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రిన్సి పాల్ సుందరి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.