నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ పట్టణంలోని వినాయక నగర్, మాలపల్లి పీల స్కూల్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ఎన్నికల ప్రచారం సోమవారం నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ పట్టణంలో అభివృద్ధి చేస్తామని కేసిఆర్ ప్రభుత్వం మోసం చేసింది. నిజామాబాద్ పట్టణానికి ఒక మహిళ డిగ్రీ కాలేజీ తేలేదు. మహిళల కోసం మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన అని చెప్పే కవిత తండ్రి సీఎం అయిన మహిళ కాలేజీ ఎందుకు తేలేకపోయింది. ఎందరో నిరుపేదలు ఇండ్లు లేక రోడ్లపై జీవనం సాగిస్తున్నారు కానీ కేసీఆర్ 150 గదులతో పెద్ద గడీని కట్టుకుండు. పదేళ్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.కాంగ్రెస్ పార్టీఅధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం అని తెలియజేశారు. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని పిలుపునిచ్చారు. పదేళ్లుగా ఈ ప్రాంతానికి ఏమీ చేయని బీఆరెస్, ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తున్నారు. అందుకే కారు గుర్తును బొందపెట్టాలి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలతోపాటు తులం బంగారం అందిస్తాం. కేసీఆర్ కు పదేళ్లు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏందో నిజామాబాద్ ప్రజలకు చూపిస్తా డివైడర్లు కట్టి లైట్లు పెట్టిస్తే అభివృద్ధి కాదు ఇమాత్రం పని ప్రతి గ్రామంలో ఒక వార్డు మెంబర్ కూడా చేసుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ ప్రకటించిన ఆరు పథకాలను ప్రజలకు అందిస్తాం.500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకోవడానికి ఆరు లక్షల రూపాయలు చేయుత,10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా ఉచిత వైద్యం అందిస్తా అని,200 యూనిట్లు కరెంటు ఉచితం, 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ స్కీమ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు