ఊపందుకున్న ఎన్నికల ప్రచారం

–  మోడీ వర్సెస్‌ కాంగ్రెస్‌ గ్యారెంటీ హామీలు
జైపూర్‌ : 2023 రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు తమ అభ్యర్థులను గెలిపించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ ‘గ్యారంటీ యాత్ర’ ప్రారంభించనుంది. మొత్తం 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ గ్యారంటీ యాత్ర రథాలు ప్రచారం నిర్వహించనున్నాయి. కేంద్ర మంత్రి అమిత్‌ షా మంగళవారం రాజస్థాన్‌లో పర్యటించారు. నాగౌర్‌లో మూడు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో మోడీ హామీపై బీజేపీ విశ్వాసం ఉంచగా, గెహ్లాట్‌ హామీపై కాంగ్రెస్‌ పందెం వేసింది. కాగా, కాంగ్రెస్‌ మంగళవారం ‘గ్యారంటీ యాత్ర’ ప్రారంభించింది. తాజాగా కాంగ్రెస్‌ 7 హామీలి చ్చింది. ఈ హామీలపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రతి డివిజన్‌లో యాత్రను ప్రారంభించనున్నారు. మొదటి రోజు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ జైపూర్‌లోని మోతీ డుంగ్రీ గణేష్‌ ఆలయం నుంచి గ్యారెంటీ యాత్రను ప్రారంభించారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని జైపూర్‌, జోధ్‌పూర్‌, కోట, భరత్‌పూర్‌, ఉదరుపూర్‌, అజ్మీర్‌, బికనీర్‌ డివిజన్లతో పాటు ఇతర జిల్లాల్లో ఏడు డివిజన్లలో సంచరించే రథాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు.