
– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి.
నవతెలంగాణ – తొగుట
తెలంగాణ కలను సాకారం చేసి, అభివృద్ధి, సంక్షే మం లో దేశంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దిన తెలం గాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిల వాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడి పల్లి రాంరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ఎల్ బంజేరు పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద, వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఉమ్మడి మెదక్ జిల్లా అడ్డా గా నిలిచిందన్నారు. సిద్దిపేట బిడ్డ కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి జీవం పోశా రని, వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ను నిలబెట్టా రని తెలిపారు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేడు మోసం చేశాడన్నారు. కష్ట కాలంలో బీఆర్ఎస్ కు అండగా నిలవాలని కోరా రు. కలెక్టర్ గా పరిపాలనా అనుభవం ఉన్న వెంక ట్రామరెడ్డి కి ఎంపీ గా అవకాశం కల్పించాలన్నా రు. గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పా టు చేసి యువకులకు అండగా నిలుస్తారని తెలి పారు. నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి పేదలకు ఉచితం వివాహాలు చేసేందుకు అవకాశం కల్పిస్తారని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎడ్లు నాగలి, నిరుద్యోగ భృతి, పించిన్ ఇస్తామని రఘునందన్ రావు మాట తప్పడన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు బుట్ట దాఖలు చేసిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం లేని లోటు స్పష్టం గా కనిపిస్తోందని, కేసీఆర్ బస్సు యాత్రకు అడుగ డుగునా నీరాజనం పడుతున్నారన్నారని తెలి పారు. భారీ మెజారిటీ అందించి సత్తా చాటాలని కోరారు. ఓటు వేసే ముందు మోసం చేసే వారు కావాలా..?నమ్మకం చేసే వారు కావాలా…?అని ఆలోచించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సూరంపల్లి స్వామి, బూత్ అధ్యక్షులు అల్వాల గణేష్, నాయ కులు బిక్కనూరి శ్రీశైలం, డబ్బికారి పెంటొజీ, మంతూరి రమేష్, ఆనందం, సుతారి రాములు, స్వామి, నర్సింలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు..