కాంగ్రెస్ నేతల ఎన్నికల ప్రచారం

నవతెలంగాణ-ముత్తారం : కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు శుక్రవారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డ ప్రాంతంలో ఈ నెల 13వ జరగనున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కి చేతి గుర్తు కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తాటిపాముల వకుల రాణి శంకర్, సీనియర్ నాయకులు గుడికొండాల్ రెడ్డి, మల్యాల రాజయ్య, ,కోల విజయ్ ,నగేష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.