స‌కుటుంబ స‌మేతంగా ఎన్నికల ప్రచారం 

పతుల కోసం సతులు, బంధువుల క్యాంపేయిన్‌
– పల్లె, పట్నం జనంతో మమేకం 
నవతెలంగాణ- నసురుల్లాబాద్ : ఎన్నికలు దగ్గర పడడంతో ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. నామినేషన్ వేసిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు గ్రామాలకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి గడపనూ సందర్శిస్తూ.. ప్రజల ఓట్లను అభ్యర్థిస్తూ.. నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేడి గ్రామాల్లో రాజుకున్నది. నామినేషన్లు వేసిన అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మద్దతుగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు నియోజకవర్గంలో
క్యాంపేయిన్లలో విస్తృతంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఎస్పీ ఇతర అభ్యర్థుల గెలుపు కోసం  పతుల కోసం సతుల ఫ్యామిలీ మెంబెర్స్  ప్రచారంలో దూకుడు పెంచారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మెజార్టీ కోసం తనయులు పోచారం భాస్కర్ రెడ్డి సురేందర్ రెడ్డి రవీందర్ రెడ్డిలు వారి బంధువులు, గెలుపే లక్ష్యంగా నిత్యం పల్లె, పట్నం అన్న తేడా లేకుండా  గడపగడపనూ సందర్శించి.. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని జనానికి వివరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిబ్సతీమణి మంజుల, కుమారుడు తోపాటు వారి వియ్యంకురలు సుచిత్ర రెడ్డి ఓటర్లతో కలిసిపోతున్నారు. అలాగే ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం స‌కుటుంబ స‌మేతంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేడి గ్రామాల్లో రాజుకున్నది. నామినేషన్లు వేసిన అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మద్దతుగా సకుటుంబ సపరివార సమేతంగా ఆయా సెగ్మెంట్లలోని క్యాంపేయిన్లలో విస్తృతంగా పాల్గొంటున్నారు. బీఅర్ఎస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని జనానికి వివరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.